భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన ఐదో టెస్టు అర్థవంతంగా రద్దు కావడంతో టీమిండియా ఆటగాళ్లు, ఐపీఎల్ 2021 రెండో దశ కోసం యూఏఈ చేరుకుంటున్నారు. ఇండియన్ ప్రిమియర్ లీగ్ 2021లో మిగిలిన మ్యాచ్‌లు ఆడేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి, పేస్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదివారం దుబాయ్ చేరుకున్నారు. మీరందరూ ఎదురు చూస్తున్న వార్త.. కింగ్ కోహ్లి, మియా మ్యాజిక్ దుబాయ్‌లోని టీమ్‌తో కలిశారు అని ఆర్సీబీ టీమ్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, చెన్నై ఫ్రాంచైజీలు తమ టీమ్‌లలోని స్టార్ ప్లేయర్స్ రాకను ప్రకటించాయి.
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు చేరుకున్నారు. వీరి వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అబుదాబి విమానాశ్రయంలో వీరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
ఈ నెల 19 నుంచి ఐపీఎల్ మళ్లీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్ రద్దు కావడంతో షెడ్యూల్ కంటే ముందుగానే ఇండియన్ టీమ్ ప్లేయర్స్ దుబాయ్ చేరుకున్నారు. ఇంగ్లండ్ నుంచి యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండునున్నారు. తర్వాత జట్టు బయోబబుల్‌లో కలుస్తారాని ముంబై యాజమాన్యం తెలిపింది.