జోరూట్ సెంచ‌రీ.. తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశ‌గా ఇంగ్లాండ్‌

Root's record ton leaves India gasping. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్ సెంచ‌రీ

By Medi Samrat  Published on  26 Aug 2021 4:13 PM GMT
జోరూట్ సెంచ‌రీ.. తొలి ఇన్నింగ్సులో భారీ ఆధిక్యం దిశ‌గా ఇంగ్లాండ్‌

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌ జో రూట్ సెంచ‌రీ న‌మోదుచేశాడు. భీకర ఫామ్‌లో ఉన్న రూట్‌కు ఈ సిరీస్‌లో ఇది వరుసగా మూడో సెంచరీ. 96 పరుగుల వద్ద ఉన్న‌ప్పుడు ఇషాంత్ బౌలింగ్‌లో బౌండ‌రీ కొట్టి రూట్ శతకం నమోదు చేశాడు. 12 ఫోర్ల సాయంతో 124 బంతుల్లో రూట్ బాదాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి భార‌త‌ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డ్డ రూట్.. అదే జోరు కొనసాగిస్తున్నాడు. రూట్ కి బెయిర్‌స్టో అండగా నిలబడ్డాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును వేగంగా కదిలిస్తూ ఆధిక్యాన్ని 300 పరుగుల దిశగా తీసుకెళ్లారు.

ఈ క్ర‌మంలోనే బెయిర్‌స్టో ష‌మీ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో బర్న్స్ (61), హసీబ్ హమీద్ (68), డేవిడ్ మలాన్ (70) రాణించారు. టీమిండియా తొలి ఇన్నింగ్సులో 78 ప‌రుగుల‌కే ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి.. 275 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్ర‌స్తుతం క్రీజులో శ‌త‌క వీరుడు జో రూట్, విధ్వంస‌క‌ర జాస్ బ‌ట్ల‌ర్ అన్నారు. ఇక భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో ఇంగ్లాండ్‌ సారథి జో రూట్‌ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకు గ్యారీ సోబర్స్‌, వీవ్‌ రిచర్డ్స్‌, రికీపాంటింగ్, స్మిత్, రూట్‌ తలో 8 శతకాలు బాదారు.


Next Story