కార్తిక్ పై రోహిత్ ఆగ్రహం.. వీడియో వైరల్
Rohit's aggressive gesture towards Karthik after no DRS appeal.తొలి టీ20లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 21 Sept 2022 12:34 PM ISTతొలి టీ20లో ఆసీస్ చేతిలో భారత్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత బౌలర్లు విఫలం కావడంతో ఆస్ట్రేలియా సునాయాసనంగా లక్ష్యాన్ని చేదించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. రోహిత్ శర్మ.. దినేశ్ కార్తిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
ఇన్నింగ్స్ 12 ఓవర్‌ను ఉమేశ్ యాదవ్ వేశాడు. ఈ ఓవర్‌లో రెండో బంతిని స్టీవ్ స్మిత్ షాట్‌కు యత్నించగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ చేతుల్లో పడింది. కార్తిక్ అప్పీల్ చేయగా.. అంఫైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో రోహిత్ రివ్యూకి వెళ్లగా ఫలితం భారత్‌కు అనుకూలంగా రాగా.. స్టీవ్ స్మిత్ పెవిలియన్‌కు వెళ్లాడు. అదే ఓవర్ ఆఖరి బంతి గ్లెన్ మ్యాక్స్‌వెల్ బ్యాట్‌కు సమీపంగా వెలుతూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. ఓ చిన్నపాటి సౌండ్ కూడా వచ్చింది. భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా.. ఈ సారి కూడా అంఫైర్ నాటౌట్ ఇచ్చాడు. మరోసారి రోహిత్ రివ్యూకి వెళ్లగా.. బంతికి బ్యాట్‌కు తాకినట్లు కనిపించడంతో అంఫైర్ ఔట్ ఇచ్చాడు.
Rohit Sharma try to kill Dinesh Karthik@ImRo45 @BCCI pic.twitter.com/06d6QpaPeH
— Jiaur Rahman (@JiaurRa91235985) September 20, 2022
కాగా.. ఈ సమయంలో రోహిత్ శర్మ కోపంగా.. "నీకెన్ని సార్లు చెప్పాలి గట్టిగా అప్పీల్ చేయమని, రివ్యూకు వెళ్లు అని నాకెందుకు చెప్పవు " అంటూ దినేశ్ కార్తిక్ ముఖాన్ని పట్టుకున్నాడు. ఆ తరువాత రోహిత్.. అభిమానుల వైపు తిరిగి కన్ను కొట్టాడు. దీంతో ఇదంతా సరదా కోసం చేశాడని అర్థం అవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కాగా.. 2007 నుంచి కార్తీక్, రోహిత్ కలిసి ఆడుతున్న సంగతి తెలిసిందే. తమ మధ్య స్నేహం ఎంత బలంగా ఉందో చూపించడానికే రోహిత్ అలా చేశాడని అంటున్నారు.