అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!

ఫిబ్రవరి 6న నాగ్ పూర్ వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌ను కొనసాగించాడు.

By Medi Samrat  Published on  6 Feb 2025 7:19 PM IST
అలా అవుట్ అయ్యాడు.. ఇలా విమర్శలు మొదలయ్యాయి..!

ఫిబ్రవరి 6న నాగ్ పూర్ వేదికగా భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్‌ను కొనసాగించాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మపై అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. భారత కెప్టెన్ 7 బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసాడు. సాకిబ్ మహమూద్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఆడిన రోహిత్‌, ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ లో చెత్తగా ఆడడంతో రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ తీసుకోవాలని పలువురు అభిమానులు కోరుతున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది. కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్న యువ పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లను తీశాడు. లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ 1, అక్షర్ పటేల్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో.. ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (43), బెన్ డకెట్ (32) తొలి వికెట్ కు 75 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత బౌలర్లు విజృంభించి వరుసగా 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ జోరుకు కళ్లెం వేశారు. ఇంగ్లండ్ మిడిలార్డర్ లో కెప్టెన్ జోస్ బట్లర్ (52), జాకబ్ బెతెల్ (51) అర్ధసెంచరీలతో రాణించారు. జోఫ్రా ఆర్చర్ వేగంగా ఆడి 21 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.


Next Story