తండ్రి ఆరోగ్యంపై రోహిత్ కూతురు స‌మైరా అప్‌డేట్‌.. వీడియో వైర‌ల్‌

Rohit Sharma’s daughter Samaira gives update on father’s health.టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Jun 2022 6:59 AM GMT
తండ్రి ఆరోగ్యంపై రోహిత్ కూతురు స‌మైరా అప్‌డేట్‌.. వీడియో వైర‌ల్‌

టీమ్ఇండియా ప్ర‌స్తుతం ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉంది. గ‌తేడాది క‌రోనా కార‌ణంగా వాయిదా పడిన ఐదో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు ఆట‌గాళ్లు సిద్దం అవుతున్నారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శ‌ర్మ క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నాడు. మ్యాచ్ ఆరంభం కానున్న జులై 1 నాటికి రోహిత్ కోలుకునే అవ‌కాశం ఉంది. అయితే.. అత‌డు తుది జ‌ట్టులో ఉంటాడా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ క్ర‌మంలో రోహిత్ కూతురు స‌మైరా.. తండ్రి ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది.

స‌మైరా.. తల్లి రితికాతో క‌లిసి బ‌య‌ట‌కు వ‌చ్చింది. హోట‌ల్ లాంజ్‌లో వాళ్ల‌ని గ‌మ‌నించిన అభిమానులు ప‌ల‌రించారు. డాడీ ఎలా ఉన్నాడు అని ఓ వ్య‌క్తి అడుగ‌గా.. డాడీ త‌న రూమ్‌లోనే ఉన్నాడ‌ని, విశ్రాంతి తీసుకుంటున్నాడ‌ని చెప్పింది. నాన్న‌కు కొవిడ్‌-19 పాజిటివ్ వ‌చ్చింద‌ని, కోలుకోవ‌డానికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని త‌న ముద్దు ముద్దు మాట‌ల‌తో చెప్పింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే.. రోహిత్‌ కరోనా సోకడంతో బీసీసీఐ అప్ర‌మ‌త్త‌మైంది. వెంట‌నే మ‌యాంక్ అగ‌ర్వాల్‌ను ఇంగ్లాండ్‌కు పంపించింది. ఇంగ్లాండ్‌లో క‌రోనా నియ‌మాల ప్ర‌కారం క్వారంటైన్ అవ‌స‌రం లేదు కాబ‌ట్టి అత‌డు వెంట‌నే జ‌ట్టుతో క‌లుస్తాడు. అవ‌స‌రం అయితే.. టెస్టు మ్యాచ్‌లో బ‌రిలోకి దిగుతాడ‌ని ఓ బీసీసీఐ అధికారి తెలిపాడు. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి మ‌యాంక్ ఓపెనింగ్ చేసే అవ‌కాశం ఉంది.

Next Story
Share it