తొమ్మిదేళ్ల నాటి హిట్‌మ్యాన్‌ ట్వీట్ వైరల్

Rohit Sharma's 9-Year-Old Tweet Is Viral.పుల్ టైం టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోహిత్ శ‌ర్మ తొలి మ్యాచ్‌లోనే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Nov 2021 1:37 PM IST
తొమ్మిదేళ్ల నాటి హిట్‌మ్యాన్‌ ట్వీట్ వైరల్

పుల్ టైం టీ20 కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రోహిత్ శ‌ర్మ తొలి మ్యాచ్‌లోనే విజ‌యాన్ని అందుకున్నాడు. బుధ‌వారం రాత్రి జైపూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త జ‌ట్టు 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 164 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్ గుప్టిల్ (70), మార్క్‌ చాప్‌మన్‌(63) లు రాణించారు. అనంత‌రం 165 ప‌రుగుల ల‌క్ష్యాన్ని టీమ్ఇండియా 19.4 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి చేదించింది. చేధ‌న‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ (48; 36 బంతుల్లో 5 పోర్లు, 2 సిక్స‌ర్లు), సూర్య‌కుమార్ యాద‌వ్‌(62; 40 బంతుల్లో 6పోర్లు, 3 సిక్స‌ర్లు) లు ధాటిగా ఆడారు.

ఇంక‌ముందు రోహిత్ ప‌లు మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించినప్ప‌టికి పుల్ టైం కెప్టెన్‌గా ఇదే రోహిత్‌కు తొలి మ్యాచ్‌. ఈ నేప‌థ్యంలో రోహిత్ శ‌ర్మ తొమ్మిది సంవ‌త్స‌రాల క్రితం చేసిన ఓ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. ' జైపూర్‌కు చేరుకున్నాం. నేనే జట్టుకు ఇప్పుడు కెప్టెన్. అది నా మీద మరింత బాధ్యతను పెంచింది ' అని రోహిత్ 2012 న‌వంబ‌ర్ 7న ట్వీట్ చేశాడు. కాగా.. 2012లో జైపూర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ముంబైకి కెప్టెన్‎గా హిట్‌మ్యాన్ వ్యవహరించాడు

2012లో కెప్టెన్‌గా తొలిసారి రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలో ముంబైని నడిపించాడు. మొదటిసారిగా పుల్‌టైం టీ20 సార‌ధిగా నాయకత్వం వ‌హించాడు. ఈ రెండు మ్యాచ్‌లు కూడా అదే గ్రౌండ్‌లో కావ‌డం గ‌మ‌నార్హం అంటూ ఓ అభిమాని రోహిత్ చేసిన పాత ట్వీట్‌ను రీట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఇది సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story