టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్‌దేహ్ పుట్టిన రోజు నేడు. 33వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా భార్యకు హిట్‌మ్యాన్ శుభాకాంక్షలు చెప్పాడు. హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నిన్నెప్పటికీ ప్రేమిస్తుంటా అని వ్రాసి.. వాళ్లిదరూ కలిసి దిగిన సెల్పీలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. గత వారమే ఈ జంట ఐదో వివాహా వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది. ప్రస్తుతం రోహిత్ శర్మ ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌లో ఉన్నాడు.
తొలి టెస్టులో భారత జట్టు ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. దీంతో హిట్ మ్యాన్ సాధ్యమైనంత తొందరగా జట్టులో చేరాలని అభిమాలనులతో పాటు పలువురు మాజీలు కోరుకుంటున్నారు. ఇటీవలే బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకున్న రోహిత్.. టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు ఆసీస్ వెళ్లాడు. అక్కడి నిబంధనల ప్రకారం 14 రోజులు పాటు క్వారంటైన్‌లో ఉండనున్నాడు. రోహిత్ శర్మ మూడో టెస్టు మ్యాచ్ నుంచి అందుబాటులోకి రానున్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, మహ్మద్ షమీ ఇద్దరూ కూడా స్వదేశానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది.