కోహ్లీకి వారి నుండి ఫుల్ సపోర్ట్

Rohit Sharma Supports Virat Kohli. కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం రెండో వన్డే అనంతరం నిర్వహించిన పాత్రికేయుల

By Medi Samrat  Published on  15 July 2022 10:56 AM GMT
కోహ్లీకి వారి నుండి ఫుల్ సపోర్ట్

కెప్టెన్ రోహిత్ శర్మ గురువారం రెండో వన్డే అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కోహ్లీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ మీదే చర్చ నడుస్తుంది కదా..' అని రిపోర్టర్ అడగగానే.. రోహిత్ మాట్లాడుతూ.. 'అసలు చర్చ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. కోహ్లీ ఇన్నేండ్లుగా వందలాది మ్యాచులు ఆడాడు. భరోసా ఉంచాల్సిన అవసరం లేని బ్యాటర్ అతడు. నేను నా గత ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పాను.. మళ్లీ అదే చెబుతున్నాను.. ప్రతి క్రికెటర్ కెరీర్ లో ఇది సహజం. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతున్న వాళ్లు తిరిగి ఫామ్ అందుకోవడానికి ఒకటి రెండు ఇన్నింగ్స్ చాలు. నేనైతే అదే అనుకుంటున్నా. కానీ ఏ క్రికెటర్ కెరీర్ లో అయినా ఎత్తుపల్లాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి." అంటూ ఫుల్ క్లాస్ తీసుకున్నాడు.

ఇక రెండో వన్డేలో కోహ్లీ స్వ‌ల్ప స్కోరుకే ఔటైన వెంట‌నే పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ఓ ట్వీట్ చేశాడు. స్టే స్ట్రాంగ్‌ అంటూ కోహ్లీకి అండ‌గా ఓ ట్వీట్ చేశాడు. కోహ్లీతో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.


Next Story
Share it