రెండో వ‌న్డేలో విజయం తర్వాత ఆటగాళ్లకు రోహిత్ వార్నింగ్

ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయం సాధించింది.

By Medi Samrat  Published on  10 Feb 2025 9:27 AM IST
రెండో వ‌న్డేలో విజయం తర్వాత ఆటగాళ్లకు రోహిత్ వార్నింగ్

ఆదివారం కటక్‌లో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. మ్యాచ్ తర్వాత, జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును ప్రశంసించాడు, కానీ తన ఆటగాళ్లను హెచ్చరించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ సాధించాడు. రోహిత్ 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 119 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

మ్యాచ్‌ తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. జట్టుగా మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నామ‌న్నారు. "మేము నిరంతరం మెరుగుపడాలనుకుంటున్నాము. మేము ఏ ఒక్కఅంశంపైనో దృష్టి పెట్టడం లేదు.. ఆటగాడిగా, జట్టుగా మెరుగవ్వడమే మా లక్ష్యం అన్నాడు. ఇదే మేము చేయాలనుకుంటున్నాము. ఆటగాళ్లకు తాము ఏమి చేయాలో తెలిసినంత వరకు.. వారు దానిని కొనసాగిస్తే సమస్య లేదు అన్నాడు. ఆటగాళ్లు తమ బాధ్యతలను తప్పనిసరిగా గుర్తించి, తదనుగుణంగా ఆడాల్సి ఉంటుందని.. ఇలాగే కొనసాగితే బాగుంటుంది.. లేకుంటే ఆట‌గాళ్ల‌ వ‌ల్ల‌ జట్టుకు ఇబ్బంది అని హెచ్చ‌రించాడు.

వైస్ కెప్టెన్ గిల్‌తో కలిసి రోహిత్‌ తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో భారత్ విజయానికి పునాది పడింది. తొలి మ్యాచ్‌లో తుఫాను ఇన్నింగ్స్ ఆడిన శ్రేయాస్ అయ్యర్ కూడా 44 పరుగులు చేశాడు. వీరిద్దరిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ విపరీతంగా ప్రశంసలు కురిపించాడు. "గిల్, అయ్యర్ నుండి నాకు మంచి మద్దతు లభించింది. నేను గిల్‌తో బ్యాటింగ్ చేయడం ఆనందిస్తాను. అతను చాలా మంచి ఆటగాడు.. పరిస్థితులు అతనిని ప్రభావితం చేయవు.. నేను సరిగ్గా ఉంటే.. మంచి స్కోర్స్ కూడా గిల్‌తో ఉంటాయి" అని రోహిత్ అన్నాడు.

తొలి మ్యాచ్‌లో కూడా గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. నాగ్‌పూర్‌లో గిల్ 87 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లోనూ గిల్‌ బలమైన ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.

Next Story