ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం కానున్నాడా..?
Rohit Sharma set to miss Australia Test series. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత ఆటగాడు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
By Medi Samrat Published on 24 Nov 2020 7:27 AM GMTతొడ కండరాల గాయంతో బాధపడుతున్న భారత ఆటగాడు, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. అయితే.. రోహిత్ శర్మ ఇంకా పిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. గతకొన్ని రోజులుగా హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్‌పై ఎలాంటి పురోగతి లేదని సమాచారం. ఆసీస్‌తో టెస్టు సిరీస్ ఆడాలంటే.. మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో రోహిత్ ఆస్ట్రేలియా రావాల్సి ఉంటుందని టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి చెప్పిన సంగతి తెలిసిందే. ఆలస్యం అయ్యే కొద్దీ పరిస్థితులు మారిపోతాయని, క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో వీలైనంత త్వరగా భారత్ నుంచి బయల్దేరాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. టెస్టు సిరీస్‌లో ఆడాలంటే కనీసం ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లోనైనా ఆడాల్సి ఉంటుందని తెలిపాడు.
రోహిత్ గాయం నుంచి ఇంకా కోలుకోలేదని.. ప్రస్తుతం రోహిత్ ఉన్న పరిస్థితుల్లో ఆసీస్ వెళ్లడం కష్టమేనని తెలుస్తోంది. దీంతో ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు రోహిత్ దూరం కానున్నాడని సమాచారం. ఇదే జరిగితే.. టీమ్ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పవచ్చు. తొలి టెస్టు అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్ రానున్న నేపథ్యంలో రోహిత్ సైతం టీమ్‌కు అందుబాటులో లేకుంటే.. బ్యాటింగ్ ఆర్డర్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. ఇక సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సైతం ఆసీస్ కు వెళ్లడం కష్టంగానే కనిపిస్తోంది. అతడు కూడా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించలేదు.
హిట్ మ్యాన్ ఈ సిరీస్‌కు అందుబాటులో లేకుంటే.. అతడి స్థానంలో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ బావిస్తోంది. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో నెంబర్ 4 స్థానంలో సత్తా చాటాడు అయ్యర్. రోహిత్ స్థానంలో అయ్యర్ ను తీసుకుంటే.. టెస్టులో కూడా శ్రేయాస్ అరగ్రేటం ఖాయం అనే చెప్పవచ్చు. మరీ రోహిత్ ఆసీస్ వెళతాడో లేదో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.