అనవసర విమర్శలకు నేను వ్యతిరేకం.. వాటిని పట్టించుకోను : రోహిత్
టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విమర్శకులకు గట్టి క్లాస్ ఇచ్చాడు.
By Medi Samrat
టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ విమర్శకులకు గట్టి క్లాస్ ఇచ్చాడు. ఆటగాళ్లపై విమర్శలకు తాను వ్యతిరేకం కాదని, అయితే అనవసర విమర్శలు తనకు ఇష్టం ఉండవని రోహిత్ చెప్పాడు. కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండానే విమర్శకులు ఆటగాళ్లపై దాడి చేస్తారని అభిప్రాయపడ్డాడు. రోహిత్ తన ఐపీఎల్ ఫామ్‌తో పాటు అనేక ఇతర విషయాలను దృష్టిలో ఉంచుకుని పలు వ్యాఖ్యలు చేశాడు.
విమర్శలు ఆటగాడి జీవితంలో భాగమని రోహిత్ అన్నాడు. తన బ్యాటింగ్‌పై వచ్చే విమర్శలను పట్టించుకోనని అన్నాడు. విమర్శల వల్ల తన బ్యాటింగ్ ప్రభావితం కాదని చెప్పాడు. సీనియర్ జర్నలిస్ట్ విమల్ కుమార్‌తో రోహిత్ మాట్లాడుతూ.. 'విమర్శ అనేది ఆటగాడి జీవితంలో భాగమని.. విమర్శలు అవసరం, ముఖ్యం.. కానీ అనవసర విమర్శలకు నేను వ్యతిరేకం. ఇది నాకు ఇష్టం లేదు. నా గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ నేను వాటిలో దేనినీ పట్టించుకోను అని వ్యాఖ్యానించాడు. తన ఆట అటాక్ చేయడమేనని, ఎడమచేతి వాటం బౌలర్ల బంతులను డిఫెన్స్‌గా ఆడడం తన ఆట కాదని విమర్శలకు రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. "నా గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. నేను ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్లను ఆడలేను, చాలా ఇతర విషయాలు.. కానీ ఇప్పుడు నేను ఈ విషయాలను పట్టించుకోను అన్నాడు."
ఇదిలావుంటే.. ఐపీఎల్-2025లో రోహిత్ 11 మ్యాచ్‌లలో 300 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్‌కు మొదట్లో పరుగులు చేయడం కష్టంగా అనిపించినా.. చివరి మ్యాచ్‌ల్లో అతడు బ్యాట్‌తో విజృంభించి మూడు అర్ధ సెంచరీలు సాధించాడు.