ఈ గొడవేంది..? టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది రోహిత్ కెప్టెన్సీలోనే కదా..?
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసింది.
By - Medi Samrat |
భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసింది. BCCI నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో ఒక పెద్ద తప్పు జరిగింది. ప్రజెంటేషన్ సమయంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా చూపించారు. BCCI చరిత్రను తిరిగి వ్రాయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ అభిమానులు బోర్డుపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
2025లో అసాధారణ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లను బీసీసీఐ ఇటీవల సత్కరించింది. 2025, 2026లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్న భారత కెప్టెన్లందరూ హాజరయ్యారు. రోహిత్ హాజరు కాకపోయినా.. అతని కెప్టెన్సీలో భారత్ 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. వేడుకలో గ్రాఫిక్స్ గిల్‌ను విజేత కెప్టెన్‌గా చూపించాయి.. ఇది అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది.
వేడుకలో ఒక పెద్ద పొరపాటు జరిగి రోహిత్ శర్మ అభిమానులకు కోపం తెప్పించింది. భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ వేదికపై ఛాంపియన్స్ ట్రోఫీ విజయం గురించి చర్చిస్తున్నప్పుడు.. స్క్రీన్‌పై ఉన్న గ్రాఫిక్స్ అతన్ని "విజేత కెప్టెన్, ఛాంపియన్స్ ట్రోఫీ 2025" అని చూపించాయి.
అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. రోహిత్ సారథ్యంలోని జట్టు ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. శుభ్‌మాన్ గిల్ ఆ జట్టులో కీలక బ్యాట్స్‌మన్, టోర్నమెంట్‌లో 188 పరుగులు చేశాడు, అందులో బంగ్లాదేశ్‌పై అజేయంగా 101 పరుగులు చేశాడు. ఇది అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. ఒక అభిమాని "BCCI చరిత్రను తిరిగి వ్రాయడానికి ప్రయత్నిస్తోంది" అని రాశాడు. మరొకరు, "ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు, నేను రోహిత్ శర్మ అని అనుకున్నాను." మరొకరు, "ఇది పట్టపగలు దొంగతనం" అని రాశాడు.
అయితే.. శుభ్‌మాన్ గిల్ గత ఏడాది 2,025 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఐదు టెస్టుల్లో 754 పరుగులు చేశాడు, వాటిలో నాలుగు సెంచరీలు ఉండగా.. అత్యధిక స్కోరు 269. అతని సగటు 75.40. అతను ఏడాది పొడవునా టెస్ట్‌లలో 983 పరుగులు చేశాడు. అతను వన్డేల్లో నంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక పాత్ర పోషించాడు.