సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరగబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదవ, చివరి టెస్ట్ కోసం భారత ప్లేయింగ్ XI నుండి కెప్టెన్ రోహిత్ శర్మను తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడని సమాచారం అందిందని ఇండియా టుడే నివేదించింది. భారత్ తరఫున 67 టెస్టుల్లో ఆడిన రోహిత్ శర్మ మళ్లీ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవని కూడా అంటున్నారు.
రోహిత్ స్థానంలో శుభ్‌మన్ గిల్‌ని ప్లేయింగ్ లెవెన్ లో చేర్చారు. నంబర్ 3లో బ్యాటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. KL రాహుల్, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ వస్తారని అంటున్నారు. సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత చివరి శిక్షణా సెషన్‌లో రోహిత్ శర్మ తక్కువ సమయం మాత్రమే కనిపించాడు. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, బుమ్రాతో సహా కోచ్‌లతో రోహిత్ ఎక్కువగా మాట్లాడటం కనిపించింది. మ్యాచ్ మొదలయ్యే సమయంలోనే ఈ కథనాలకు ఓ క్లారిటీ రానుంది.