ఆసీస్- భారత్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17నుంచి జరగనుంది. రోహిత్ శర్మ వంద శాతం ఫిట్‌నెస్ తో ఉంటే మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు పంపాలని అనుకుంది బీసీసీఐ. తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్ ఐపీఎల్ తర్వాత నేరుగా ముంబైకి వచ్చాడు. రోహిత్ తండ్రి కోలుకోవడంతో బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లి ఫిట్నెస్ ను అందుకోవడం ప్రారంభించాడని బీసీసీఐ తెలిపింది.
శుక్రవారం జరిగిన ఫిట్‌నెస్ టెస్టులో రోహిత్ శర్మ పాస్ అయ్యాడు. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో రోహిత్ శర్మ పాస్ అయినట్లుగా బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. దీంతో భారత అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్‌సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌కు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. డిసెంబర్ 14న రోహిత్ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. 14 రోజుల క్వారంటైన్ అనంతరం రోహిత్ జట్టుతో కలవాల్సి ఉండడంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పితృత్వ సెలవులపై భారత్ కు రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.