ఓపెనర్ గా సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ..!
Rohit Sharma. టెస్ట్ క్రికెట్ లో భారత ఆటగాడు రోహిత్ శర్మ ఓపెనర్ గా మారాక అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు.
By Medi Samrat Published on 14 Aug 2021 2:08 PM GMTటెస్ట్ క్రికెట్ లో భారత ఆటగాడు రోహిత్ శర్మ ఓపెనర్ గా మారాక అద్భుతంగా రాణిస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు టెస్ట్ మ్యాచ్ లకు రోహిత్ శర్మ పేరును పెద్దగా పరిగణించేవారు కాదు. అయితే వన్డే మ్యాచ్ లలో సుదీర్ఘ ఇన్నింగ్స్ లను ఆడడం మొదలు పెట్టిన రోహిత్ శర్మకు టెస్ట్ మ్యాచ్ లలో కూడా అవకాశం ఇచ్చారు. మొదట మిడిలార్డర్ లో వచ్చే వాడు రోహిత్. కానీ అతడు ఓపెనింగ్ చేస్తే చాలా బెటర్ అని భావించిన టీమ్ మేనేజ్మెంట్.. రోహిత్ కు ఓపెనర్ గా అవకాశం ఇచ్చింది. స్వదేశంలో సత్తా చాటిన రోహిత్ ఓవర్సీస్ లో కూడా మెరుస్తూ ఉన్నాడు. తాజాగా రోహిత్ శర్మ ఓపెనర్ గా సరికొత్త చరిత్ర సృష్టిస్తూ దూసుకువెళుతూ ఉన్నాడు.
ప్రపంచంలోనే టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓపెనర్ గా అత్యుత్తమ బ్యాటింగ్ సగటును నమోదు చేశాడు. 41 మ్యాచ్ (69 ఇన్నింగ్స్)లలో అతడు 2,810 పరుగులు చేశాడు. ఓపెనర్ గా మారాక అతడి జోరు పెరిగింది. ఓపెనర్ గా 13 ఇన్నింగ్స్ లే ఆడిన రోహిత్.. 1150 పరుగులు చేశాడు. 61.25 సగటుతో నిలిచి రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఇంగ్లండ్ కు చెందిన మాజీ క్రికెటర్ హెర్బర్ట్ సట్ క్లిఫ్ (54 మ్యాచ్లు, 84 ఇన్నింగ్స్ లు.. 4,555 పరుగులు) 61.11 సగటుతో ముందున్నాడు. అతడిని రోహిత్ దాటేశాడు. లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ లో కూడా రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తాడని భావించారు. కానీ ఆండర్సన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. ఇక ఓవర్సీస్ సెంచరీ కోసం హిట్ మ్యాన్ వేట మొదలైంది.