విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్‌శర్మ
Rohit crossed kohli in odi match wins as a captain.వన్డేలకు సారధిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలి సిరీస్‌లోనే
By తోట వంశీ కుమార్ Published on 12 Feb 2022 6:37 AM GMTవన్డేలకు సారధిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలి సిరీస్‌లోనే రోహిత్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో(భారత్‌లో) విండీస్‌ను వైట్‌వాష్ చేసిన తొలి కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. అంతేకాకుండా మాజీ సారధి విరాట్ కోహ్లీ నెలకొల్పిన ఓ రికార్డును అధిగమించాడు. భారత్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటి వరకు 13 వన్డేలకు సారధిగా వ్యవహరించగా.. 11 మ్యాచుల్లో విజయాన్ని అందించాడు. కోహ్లీ సారధిగా తొలి 13 మ్యాచుల్లో 10 విజయాలు నమోదు చేయగా.. తాజాగా ఆ రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే.. వెస్టిండీస్ ఆటగాడు క్లైవ్ లాయిడ్, పాకిస్థాన్ ఆటగాడు ఇంజమామ్ తొలి 13 మ్యాచుల్లో 12 విజయాలతో తొలిస్థానంలో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శుక్రవారం విండీస్ జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణత 50 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్(80; 111 బంతుల్లో 9 ఫోర్లు), రిషబ్ పంత్ (56; 54 బంతుల్లో 6 ఫోర్లు,1 సిక్స్) అర్థశతకాలతో రాణించారు. విండీస్ బౌలర్లలో హోల్డర్ 4, జోసెఫ్ 2, వాల్ష్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చేధనలో విండీస్ 37.1 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటటైంది. స్మిత్(36) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్, దీపక్ చాహర్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.