క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఉతప్ప

Robin Uthappa Retires From All Forms Of Indian Cricket. భారత స్టార్ ఆటగాడు రాబిన్ ఉతప్ప క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

By Medi Samrat  Published on  14 Sep 2022 2:41 PM GMT
క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఉతప్ప

భారత స్టార్ ఆటగాడు రాబిన్ ఉతప్ప క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అన్ని రకాల ఫార్మ‌ట్‌ల‌కు కొద్దిసేప‌టి క్రితం రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఈ విష‌య‌మై "నా దేశం, నా రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం నాకు గొప్ప గౌరవం. అయితే అన్ని మంచి విషయాలకు ముగింపు ఉండాలి. కృతజ్ఞతతో కూడిన హృదయంతో.. నేను అన్ని రకాల క్రికెట్ ఫార్మ‌ట్ల నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను" అని ఉతప్ప ట్వీట్ చేశాడు.

2007లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ను గెలిచిన జ‌ట్టులో ఉతప్ప స‌భ్యుడు. అతను 2021 IPL టైటిల్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జ‌ట్టులో కూడా స‌భ్యుడు. ఉతప్ప.. గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో 2012, 2014లో ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో అంతర్భాగంగా కూడా ఉన్నాడు. భారత్ తరఫున 46 వన్డేల్లో 934 పరుగులు చేసిన ఉతప్ప.. 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు.

2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 50 పరుగులు చేయడం అంతర్జాతీయ క్రికెట్‌లో ఊత‌ప్ప‌ అద్భుతమైన ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లో ఒకటి. అంతేకాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల‌లో 9వ స్థానంలో ఉన్నాడు ఊత‌ప్ప‌. 205 మ్యాచ్‌లలో 27 అర్ధసెంచరీలతో 4,952 పరుగులు చేశాడు.


Next Story