ఇండియా లెజెండ్స్ టైటిల్ నెగ్గేనా..?

Road Safety World Series 2021 Final Live Score. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఫైనల్ కు రంగం సిద్ధం అయింది. రాయ్ పూర్

By Medi Samrat  Published on  21 March 2021 1:35 PM GMT
ఇండియా లెజెండ్స్ టైటిల్ నెగ్గేనా..?

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఫైనల్ కు రంగం సిద్ధం అయింది. రాయ్ పూర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా లెజెండ్స్ జట్టు శ్రీలంక లెజెండ్స్ తో తలపడనుంది. భారత లెజెండ్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించారు. లీగ్ మ్యాచ్ లలో ఇంగ్లండ్ లెజెండ్స్ చేతిలో మాత్రమే స్వల్ప తేడాతో ఓటమిని అందుకున్నారు. ఇక మిగిలిన మ్యాచ్ లలో విజయాన్ని అందుకున్నారు. సెమీస్ లో విండీస్ లెజెండ్స్ కాస్త టెన్షన్ పెట్టినప్పటికీ.. ఆఖర్లో భారత్ ను విజయం వరించింది. మరో వైపు శ్రీలంక లెజెండ్స్ కూడా గట్టి జట్టుగా నిలిచింది. లీగ్ దశలో శ్రీలంక లెజెండ్స్ ఓడిపోయింది కేవలం భారతజట్టు మీదనే..! ఆ మ్యాచ్ లో భారత్ లెజెండ్స్ జట్టు శ్రీలంక మీద అయిదు వికెట్ల తేడాతో విజయం అందుకుంది.


శ్రీలంక లెజెండ్స్ జట్టు ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. నువాన్ కులశేఖర, జయ సింఘే, దిల్షాన్ లు రాణిస్తూ ఉండడంతో శ్రీలంక వరుస విజయాలను అందుకుంటూ వస్తోంది. బౌలింగ్ లో కూడా స్పిన్ విభాగం రాణిస్తూ ఉంది.. పరుగులను కట్టడి చేయడమే కాకుండా కీలక సమయంలో వికెట్లను కూడా తీస్తున్నారు.

ఇక ఇండియా లెజెండ్స్ జట్టు తరపున ప్రతి ఒక్కరూ మంచి టచ్ లో ఉన్నారు. సచిన్, సెహ్వాగ్ ఓపెనింగ్ మునుపటి లాగే దూకుడుగా ఉంది.. కైఫ్, యువరాజ్, యూసుఫ్ లు బ్యాటింగ్ లో రాణిస్తూ వస్తున్నారు. బౌలింగ్ విభాగంలో గోనీ, ఇర్ఫాన్ పఠాన్ లు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ఉన్నారు. అందరూ సమిష్టిగా రాణిస్తే ఫైనల్ లో శ్రీలంక లెజెండ్స్ ను ఓడించడం భారత్ లెజెండ్స్ కు పెద్ద కష్టం కాదు. సాయంత్రం 7 గంటల సమయంలో మ్యాచ్ మొదలు కాబోతోంది.
Next Story
Share it