ఢిల్లీ కెప్టెన్ పంత్ కు 12 లక్షల రూపాయల ఫైన్

ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షల రూపాయల ఫైన్ ను విధించారు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి

By Medi Samrat  Published on  1 April 2024 7:15 AM GMT
ఢిల్లీ కెప్టెన్ పంత్ కు 12 లక్షల రూపాయల ఫైన్

ఢిల్లీ కేపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు 12 లక్షల రూపాయల ఫైన్ ను విధించారు. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు భారీ జరిమానా విధించారు. డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై ఈ సీజన్ లో తమ మొదటి ఓటమిని రుచి చూశారు. పంత్ 2024లో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. CSKతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పంత్‌కు జరిమానా విధించారు. మినిమమ్ ఓవర్ రేట్ ను మెయిన్ టైన్ చేయడంలో విఫలమవడంతో IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టు చేసిన మొదటి నేరం కావడంతో, పంత్‌కి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. ఈ ఐపీఎల్ సీజన్ లో స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించిన జట్టు కెప్టెన్‌కు జరిమానా విధించడం ఇది రెండోసారి. గత మంగళవారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన శుభ్‌మన్ గిల్ కు కూడా ఇదే నేరానికి 12 లక్షల రూపాయల జరిమానా విధించారు.

IPL 2024 సీజన్‌లో ఢిల్లీ మొదటి విజయం సాధించింది. ఈ విజయంతో థ్రిల్ అయ్యానని రిషబ్ పంత్ చెప్పాడు. పంత్ ఈ మ్యాచ్ లో 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఢిల్లీ ఈ మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో 5-సార్లు ఛాంపియన్‌గా ఉన్న చెన్నైని ఓడించింది. రిషబ్ పంత్ 3 సిక్సర్లు, 4 బౌండరీలు కొట్టాడు. తాను మళ్లీ యాక్షన్‌లోకి దిగి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించగలననే నమ్మకం తనకు ఎప్పుడూ ఉందని రిషబ్ పంత్ చెప్పాడు. ఏడాదిన్నర ఆటకు దూరమైనా ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పేలేదని.. ఒక క్రికెటర్‌గా తాను 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని తెలిపాడు. గత ఏడాదిన్నరగా నేను పెద్దగా క్రికెట్ ఆడలేదు.. దాంతో ఆరంభంలో కాస్త సమయం తీసుకున్నాన్నాడు పంత్. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోలేదని.. తప్పకుండా మంచి ఇన్నింగ్స్‌ ఆడుతానని భావించానన్నాడు. ఒంటి చేత్తో సిక్స్‌ కొట్టడం బాగా అనిపించింది.. ఇలాంటి ఆట కోసం దాదాపు ఏడాదిన్నరపాటు వేచి చూశానన్నాడు పంత్.

Next Story