మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!

గాయం నుండి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా 'ఏ'తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 'ఏ' జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

By -  Medi Samrat
Published on : 30 Oct 2025 5:50 PM IST

మైదానంలో పంత్.. జెర్సీ నెంబర్ చూసి అంతా షాక్..!

గాయం నుండి కోలుకున్న రిషబ్ పంత్ దక్షిణాఫ్రికా 'ఏ'తో జరుగుతున్న అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్ 'ఏ' జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ మైదానంలో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పంత్ ధరించిన జెర్సీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రిషబ్ పంత్ 18వ నెంబర్ జెర్సీతో మైదానంలోకి అడుగు పెట్టాడు. అది మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్. కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ జెర్సీని రిషబ్ పంత్ ధరించాడు. సాధారణంగా పంత్ జెర్సీ నెంబర్ 17. పంత్ ఈ జెర్సీని ధరించి రావడంతో సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది. లెజెండరీ ఆటగాళ్లు ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత వారి జెర్సీ నెంబర్లకు కూడా వీడ్కోలు పలకడం ఆనవాయితీగా వస్తోంది. సచిన్ టెండుల్కర్ (10), ఎంఎస్ ధోనీ (7) విషయంలో బీసీసీఐ ఇదే విధంగా చేసింది. అయితే, కోహ్లీ విషయంలో ఇంకా అలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Next Story