అత్యంత ఖరీదైన ఆటగాడే.. లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి కెప్టెన్‌గా మారాడు.
By Medi Samrat
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ తదుపరి కెప్టెన్‌గా మారాడు. ఈ విషయాన్ని ఎల్‌ఎస్‌జీ యజమాని సంజీవ్ గోయెంకా సోమవారం ప్రకటించారు. సోమవారం కోల్‌కతాలోని ఆర్‌పిఎస్‌జి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ జెర్సీని సంజీవ్ గోయెంకా పంత్‌కు అందజేశారు.
IPL 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఫ్రాంచైజీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడంలో విజయం సాధించింది. గత సీజన్‌లో జట్టు ప్రదర్శన నిరాశ పరిచింది. LSG 2024లో మొదటిసారి ప్లేఆఫ్‌కు దూరమైంది. పేలవమైన నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
దీంతో టీమ్‌లో కీలక మార్పులు చేసింది. గతేడాది చివర్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో LSG ఫ్రాంచైజీకి పంత్‌ను కొత్త కెప్టెన్‌గా చేయవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ వేలంలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు పంత్ కావడం విశేషం.
Captain. Rishabh. Pant.
— Lucknow Super Giants (@LucknowIPL) January 20, 2025
That’s the tweet🔥 pic.twitter.com/3NdCc00l5D
పంత్‌కు కెప్టెన్సీ అనుభవం కూడా ఉంది. అతను IPL 2021, 2022, 2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రమాదం కారణంగా.. అతడు IPL 2023లో ఢిల్లీకి సారథ్యం వహించలేకపోయాడు. అప్పుడు డేవిడ్ వార్నర్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2025కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను వేలంలో వదిలేసింది.
రిషబ్ పంత్ లక్నోకు నాలుగో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతని కంటే ముందు కేఎల్ రాహుల్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్ ఫ్రాంచైజీ బాధ్యతలు చేపట్టారు. ఐపీఎల్‌లో పంత్ 43 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. అందులో 23 గెలుపులు.. 19 ఓటములు.. 1 మ్యాచ్ టై ఉన్నాయి.