క్రికెట్ చాలా ఇచ్చింది, సంపాదన నుంచి 10 శాతం విరాళంగా ఇస్తా: రిషభ్ పంత్

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. తనకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ప్రకటించాడు.

By Knakam Karthik  Published on  6 Feb 2025 9:27 AM IST
Sports News, Cricket, Rishab Pant, Launches Rishabh Pant Foundation

క్రికెట్ చాలా ఇచ్చింది, సంపాదన నుంచి 10 శాతం విరాళంగా ఇస్తా: రిషభ్ పంత్

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశాడు. తనకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 10 శాతం పేదలకు ఆర్థిక సాయంగా అందించనున్నట్లు ప్రకటించాడు. 'రిషభ్ పంత్ ఫౌండేషన్' ద్వారా ఈ సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో తెలిపాడు. ఈ మేరకు రిషభ్ పంత్ మాట్లాడుతూ.. కఠిన సమయాల్లో ఎలా ధైర్యంగా ఉండాలో ఎదురైన అనుభవాల ద్వారా నేర్చుకున్నానని, ఇక క్రికెట్ తనకు అన్నీ ఇచ్చిందని చెప్పాడు. తన వాణిజ్య సంపాదనలో 10 శాతం ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు.

"ఈరోజు నా దగ్గర ఉన్నదంతా అందమైన క్రికెట్ క్రీడ వల్లే. ఒక్కోసారి మ‌న లైఫ్‌లో అనుకోకుండా చోటుచేసుకునే ఘ‌ట‌న‌లు జీవిత పాఠాలు నేర్పిస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం నేను అలాంటి క‌ఠిన ప‌రిస్థితులను ఎదుర్కొన్నా. అందుకే ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నా. జీవితంలో నేను నేర్చుకున్నది ఎప్పుడూ వదులుకోకుండా, ఎల్లప్పుడూ ఆశతో నవ్వుతూ ఉండటం. నా ఆట ద్వారా నేను పొందిన దానిలో కొంత భాగం ప్రజలకు ఇచ్చి వారిలోనూ చిరునవ్వులను తీసుకురావడం అన్నది ఇప్పుడు నా లక్ష్యం.

తిరిగి ఇవ్వడం ద్వారా వ‌చ్చే ఆనందం మాట‌ల్లో చెప్ప‌లేనిది. నా వాణిజ్య ఆదాయంలో 10 శాతం రిషబ్ పంత్ ఫౌండేషన్ కోసం అంకితం చేస్తున్నా. ఆర్‌పీఎఫ్‌ నాకు చాలా ప్రియమైన ప్రాజెక్ట్. దాని ల‌క్ష్యాలు నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. వ‌చ్చే రెండు నెలల్లో దీని పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తా. మీ ప్రేమ, ఆశీస్సులు, మద్దతుకు ధన్యవాదాలు" అని పంత్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

2017లో టీమిండియా తరపున ఆరంగేట్రం చేశాడు పంత్. ఇప్పటివరకు 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన పంత్.. జట్టులో కీలక ఆటగాడిగా ఏదిగాడు. గత ఏడాది టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవగా జట్టులో పంత్ కూడా ఓ సభ్యుడు.

Next Story