దెబ్బ మీద దెబ్బ‌.. పంత్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.

By Medi Samrat
Published on : 28 May 2025 11:48 AM IST

దెబ్బ మీద దెబ్బ‌.. పంత్‌కు దిమ్మ‌తిరిగే షాకిచ్చిన బీసీసీఐ..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి తర్వాత లక్నో సూపర్ జెయింట్, కెప్టెన్ రిషబ్ పంత్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సభ్యులు, పంత్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జరిమానా విధించింది. పంత్‌కు మ్యాచ్ ఫీజుగా రూ. 30 లక్షలు, ప్లేయింగ్-11లోని ఇంపాక్ట్ ప్లేయర్, ఇతర ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా విధించారు.

IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్ రేట్‌కు సంబంధించి ఈ సీజన్‌లో జట్టు చేసిన మూడవ నేరం అని.. దీని కారణంగా కెప్టెన్ పంత్‌కు రూ. 30 లక్షల జరిమానా విధించినట్లు IPL ఒక ప్రకటనలో తెలిపింది. ప్లేయింగ్-11లో చేర్చబడిన ఇంపాక్ట్ ప్లేయర్‌లు, ఇతర ఆటగాళ్లకు రూ. 12 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించబడుతుందని తెలిపింది.

విరాట్ కోహ్లి, జితేష్ శర్మ, మయాంక్ అగర్వాల్ రాణించ‌డంతో ఆర్‌సిబి ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్‌ను ఓడించింది. ఈ విజయంతో RCB క్వాలిఫయర్-1కి చేరుకుంది. ఇప్పుడు ఆర్సీబీ మే 29న ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఎకానా స్టేడియంలో జరిగిన లీగ్ దశ చివరి మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ సాయంతో లక్నో మూడు వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది. అనంతరం ఆర్‌సీబీ 18.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ సీజన్‌లో పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న పంత్.. ఆర్‌సీబీపై సెంచరీ చేయడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. రెండో వికెట్‌కు మిచెల్ మార్ష్‌తో కలిసి 152 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. మార్ష్ 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. పంత్ తన ఐపీఎల్ కెరీర్‌లో 54 బంతుల్లో రెండో సెంచరీని పూర్తి చేశాడు. అతను 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Next Story