Video : నిశ్చితార్థం త‌ర్వాత తొలిసారి అత్తారింటికి వెళ్లిన క్రికెట‌ర్‌.. రిసీవింగ్ అదిరింది..!

భారత క్రికెట‌ర్‌ రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది.

By Medi Samrat
Published on : 15 Jun 2025 2:35 PM IST

Video : నిశ్చితార్థం త‌ర్వాత తొలిసారి అత్తారింటికి వెళ్లిన క్రికెట‌ర్‌.. రిసీవింగ్ అదిరింది..!

భారత క్రికెట‌ర్‌ రింకూ సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థం ఇటీవల జరిగింది. లక్నోలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘ‌నంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు భారత క్రికెటర్లతో పాటు పలువురు నేతలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నిశ్చితార్థం తర్వాత రింకూ సింగ్ ఇప్పుడు తొలిసారి తన అత్తమామల ఇంటికి వెళ్లాడు. దీంతో అతనికి అత్తమామల ఇంట్లో ఘన స్వాగతం లభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన అత్తమామల ఇంటికి చేరుకోగానే రింకూ సింగ్‌కు ముందుగా నుదిటిన తిలకం దిద్ద‌డం వైరల్ వీడియోలో చూడవచ్చు. అనంతరం వారిపై పూలవర్షం కురిపించారు. రింకూ లోపలికి వెళ్లగానే అతనిపై పూల వర్షం కురిపించారు. ఈ సమయంలో రింకూ చాలా సంతోషంగా కనిపించాడు.

జూన్ 8న రింకూ-ప్రియాల నిశ్చితార్థం వేడుక జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జయా బచ్చన్ సహా 20 మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, క్రికెటర్లు పీయూష్ చావ్లా, ప్రవీణ్ కుమార్, భువనేశ్వర్ కుమార్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రియా స‌రోజ్ భావోద్వేగానికి గురయ్యారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో రింకూ ప్రదర్శన గురించి మాట్లాడితే.. అత‌డు ఇప్పటివరకు రెండు వ‌న్డేలు 27.50 సగటు, 134.14 స్ట్రైక్ రేట్‌తో 55 పరుగులు చేశాడు. 33 టీ20 ఆడి 24 ఇన్నింగ్స్‌లలో 546 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో, అతని సగటు 42.00 కాగా స్ట్రైక్ రేట్ 161.06. టి20 ఇంటర్నేషనల్‌లో రింకూ 3 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 69 పరుగులు నాటౌట్.

Next Story