భారత క్రికెట్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రింకు సింగ్ ఫేస్‌బుక్ ఐడీని సైబర్ కేటుగాళ్లు హ్యాక్ చేశారు. 1.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఐడీ నుండి హ్యాకర్లు నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తుంది. రింకు సింగ్ సోదరుడు SSPకి ఫిర్యాదు చేయడంతోపాటు సైబర్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు. సైబర్ మోసగాళ్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు.
రింకు సింగ్ కొన్ని రోజుల క్రితం తన ఐడీని చెక్ చేసుకున్నాడు. పాస్‌వర్డ్‌తో కూడా అతడు దాన్ని తెరవలేకపోయాడు. అతని ఫేస్‌బుక్ ఐడి "rinkukumar344.8.7" అనే జిమెయిల్ ఐడీతో లాగిన్ అయింది. దర్యాప్తులో ఈ జిమెయిల్ ఐడి "commercial.rinkukumar" అని తేలింది.
1.6 మిలియన్ల మంది ఫాలోవర్లతో మానిటైజ్ అయిన ఆ ఫేస్‌బుక్ ఐడీ నుండి హ్యాకర్లు నిధులను స్వాహా చేస్తున్నారు. రింకు సింగ్ ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఎస్ఎస్పీకి తెలియజేశారు. దీని తరువాత.. రింకు సోదరుడు సోను సింగ్ ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని సైబర్ హ్యాకర్‌పై కేసు నమోదైంది. రింకు ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. టి 20 ప్రపంచ కప్ జట్టులో సభ్యుడు. ఈ విషయంపై సైబర్ బృందం దర్యాప్తు చేస్తోందని ఎస్ఎస్పీ నీరజ్ జాడోన్ తెలిపారు.