భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ ఎట్టకేలకు టైటిల్ నిరీక్షణకు తెరదించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్‌లో జపాన్ క్రీడాకారుడు యుషి టనాకాను 21-15, 21-11 తేడాతో ఓడించి విజేతగా నిలిచాడు. కేవలం 38 నిమిషాల్లోనే ముగిసిన ఈ పోరులో టనాకా దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ప్రత్యర్థి తప్పిదాలను లక్ష్య సేన్ తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించాడు. తొలి గేమ్‌లో 15-13 వద్ద టనాకా కాస్త పోటీ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత లక్ష్య సేన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. లక్ష్య సేన్‌కు ఇది మూడో సూపర్ 500 టైటిల్. ఈ ఏడాది హాంగ్‌కాంగ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరినా ఓటమిపాలయ్యాడు.