కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది.

By Medi Samrat  Published on  1 Oct 2024 3:30 PM IST
కాన్పూర్ టెస్ట్ లో సూపర్ విక్టరీ సాధించిన టీమిండియా

కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి భారతజట్టు ఛేజ్ చేసింది. యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ మ‌రోసారి అర్ధ శ‌త‌కం (51)తో రాణించాడు. 45 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 51 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. రోహిత్‌(8), శుభ్‌మ‌న్ గిల్ (6) త్వ‌ర‌గానే పెవిలియ‌న్ చేరినా విరాట్ కోహ్లీ (29 నాటౌట్) రాణించాడు. 17.2 ఓవ‌ర్ల‌లో భార‌త్ 3 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. బంగ్లా బౌల‌ర్ల‌లో మెహ‌దీ హ‌స‌న్ మిరాజ్ 2, ఇస్లాం ఒక వికెట్ తీశారు. భార‌త జ‌ట్టు రెండు మ్యాచ్ ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.

ఓవ‌ర్ నైట్ స్కోర్ 26/‌2తో ఐదో రోజు ఆట‌ను కొన‌సాగించిన బంగ్లా జట్టు 146 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాకు 94 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ షాద్మ‌న్ ఇస్లామ్ అర్ధ‌శ‌త‌కం (50) చేయ‌గా, ముషిఫిక‌ర్ 37 ర‌న్స్ చేశాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో జ‌స్ప్రీత్ బుమ్రా, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా త‌లో 3 వికెట్లు ప‌డగొట్ట‌గా.. ఆకాశ్ దీప్‌కు ఒక వికెట్ ద‌క్కింది. ఈ మ్యాచ్ కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను యశస్వీ జైస్వాల్ దక్కించుకోగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అశ్విన్ కైవసం చేసుకున్నారు.

Next Story