'నేను మైదానంలో ఉన్నంత కాలం నా లక్ష్యం అదే' : RCB కెప్టెన్
RCB 2008 తర్వాత మొదటిసారిగా చెపాక్ కోటలో చెన్నైని మట్టికరిపించింది.
By Medi Samrat
RCB 2008 తర్వాత మొదటిసారిగా చెపాక్ కోటలో చెన్నైని మట్టికరిపించింది. సొంతగడ్డపై CSKకి ఇదే అతిపెద్ద ఓటమి. RCB కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ చారిత్రాత్మక విజయంపై జట్టు ప్రదర్శనను ప్రశంసించాడు. చెపాక్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 196 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ రజత్ పటీదార్ కీలక పాత్ర పోషించాడు. పటీదార్ 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ తర్వాత రజత్ పాటిదార్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. నేను మైదానంలో ఉన్నంత కాలం, ప్రతి బంతికి పరుగులు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పాడు.
ఈ పిచ్‌పై ఇది మంచి స్కోరు అని రజత్ అన్నాడు. పిచ్‌పై బంతి నెమ్మదించడం వల్ల బ్యాట్స్‌మెన్‌కి అంత సులువు కాదు. అభిమానుల కారణంగా చెపాక్‌లో చెన్నైతో ఆడడం ఎప్పుడూ ప్రత్యేకమే. CSK మాత్రమే కాదు, ప్రతి జట్టు వారి సొంత మైదానంలో ఆడటం మంచిది. ఇక్కడ గెలుపు అంత సులభం కాదని మాకు తెలుసు.. కాబట్టి మేము దాదాపు 200 లక్ష్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నాము.
పాటిదార్ తన ఇన్నింగ్సు గురిచి మాట్లాడుతూ.. నేను మైదానంలో ఉన్నంత కాలం ప్రతి బంతికి పరుగులు ప్రయత్నిస్తూనే ఉండాలనే నా లక్ష్యం స్పష్టంగా ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో మేం ఎలాంటి మార్పులు చేయలేదు, గత మ్యాచ్‌లోనూ అదే జరిగింది. ఈ ట్రాక్ స్పిన్నర్లకు బాగా ఉపయోగపడింది. మేము ప్రారంభంలో స్పిన్నర్లను ఉపయోగించాలనుకున్నాము. లివింగ్స్టన్ బౌలింగ్ చేసిన విధానం అద్భుతమైనది. హేజిల్‌వుడ్ రెండు వికెట్లు తీయడం ఆటను మార్చిన క్షణం..ఎందుకంటే పవర్‌ప్లేలో మేము 2-3 వికెట్లు తీశాము.. అది విజయంలో కీలకమైందని పేర్కొన్నాడు.