11 ఖాళీ సీట్లు, నల్ల రిబ్బన్లు..మరణించిన ఫ్యాన్స్ జ్ఞాపకార్థం RCB నివాళి!

గతేడాది జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు ఘనంగా నివాళులర్పించింది.

By -  Knakam Karthik
Published on : 28 March 2026 9:00 PM IST

Sports News, Cricket News, RCB, IPL 2026, RoyalChallengersBengaluru, ChinnaswamyStadium, Tribute

11 ఖాళీ సీట్లు, నల్ల రిబ్బన్లు..మరణించిన ఫ్యాన్స్ జ్ఞాపకార్థం RCB నివాళి!

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడే ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు గతేడాది జరిగిన తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు ఘనంగా నివాళులర్పించింది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు స్టేడియం మొత్తం ఒక నిమిషం పాటు మౌనం పాటించి మృతులకు శ్రద్ధాంజలి ఘటించింది.

గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన దురదృష్టకర తొక్కిసలాటలో ఈ 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనను స్మరించుకుంటూ ఇరు జట్ల ఆటగాళ్లు నల్లటి రిబ్బన్లను ధరించి బరిలోకి దిగగా, వార్మప్ సమయంలో ఆర్సీబీ ఆటగాళ్లు '11' నంబర్‌తో కూడిన ప్రత్యేక జెర్సీలను ధరించారు. అంతేకాకుండా, మరణించిన అభిమానుల జ్ఞాపకార్థం ఈ సీజన్ అంతటా స్టేడియంలోని 11 సీట్లను ఖాళీగా ఉంచాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది.

Next Story