రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియంలో తలపడింది. ఈ టోర్నమెంట్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌లలో ఇది ఒకటి. రెండు ఫ్రాంచైజీలకు అద్భుతమైన అభిమానులు ఉన్నారు. .
ఈ రెండు జట్లు చివరిసారిగా ఈ సీజన్‌లో తలపడ్డాయి. చెన్నైలో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే ఆ సమయంలో చెన్నై అభిమానులు లాలీ పాప్ ను చేతుల్లో పెట్టుకుని బెంగళూరు జట్టును ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు బెంగళూరు అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్ద జైలు ఖైదీల తరహాలో ఉండే టీ షర్ట్స్ తో దర్శనమిచ్చారు.
కొంతమంది అభిమానులు ఐదుసార్లు విజేతలుగా నిలిచిన CSK జట్టును ట్రోల్ చేయడానికి ఉద్దేశించిన ప్రత్యేక జెర్సీని పంపిణీ చేస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ జెర్సీ తెలుపు, నలుపు రంగులో ఉంటుంది. 2016-17 అంటూ దానిపై ఉంది, ఆ రెండు సీజన్లలో CSK ఫిక్సింగ్ కుంభకోణం కారణంగా IPL నుండి దూరంగా ఉంది.