మే 17న ఐపీఎల్ 2025 తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులు తమ ఐకాన్ విరాట్ కోహ్లీని సత్కరించడానికి కాస్త కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో RCB తలపడనున్నందున, కోహ్లీ లెజెండరీ రెడ్-బాల్ కెరీర్‌కు ట్రిబ్యూట్ గా టెస్ట్ వైట్స్ ధరించాలని ఆర్సీబీ అభిమానులు కోరుతున్నారు.
అభిమానుల నేతృత్వంలోని సాగుతున్న ఈ ప్రచారం సోషల్ మీడియాలో మంచి ఆదరణ పొందడం ప్రారంభించింది. అనేక మంది RCB అభిమానులు మ్యాచ్ కు వెళ్లే ముందు తెలుపు రంగు జెర్సీలు లేదా పూర్తిగా తెల్లటి దుస్తులను ధరించమని కోరుతూ పోస్ట్‌లను పంచుకుంటున్నారు. విరాట్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్‌కు తన రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో 14 సంవత్సరాల టెస్ట్ కెరీర్‌కు అతడు ముగింపు పలికినట్లైంది. భారత్ టీ20 వరల్డ్ కప్ గెలిచాక విరాట్ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కోహ్లీ ఇప్పుడిక కేవలం వన్డే క్రికెట్‌లోనే కొనసాగుతున్నాడు.