పలు విషయాలపై నోరు విప్పిన జడేజా..
Ravindra Jadeja's savage reply to James Anderson. బర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో పంత్ తో
By Medi Samrat Published on 3 July 2022 8:15 PM ISTబర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో పంత్ తో పాటూ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇబ్బందుల్లో ఉన్న భారత్ ను పటిష్ట స్థితికి తీసుకుని వచ్చాడు. అయితే ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ జడేజాను తీసి పారేస్తూ వ్యాఖ్యలు చేశాడు. "గతంలో జడేజా 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేవాడనుకుంటా. అతడు లోయరార్డర్ ఆటగాడు. ఇప్పుడు కొంచెం ఫర్వాలేదు. 7వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతున్నాడు. కాస్త బ్యాట్స్ మన్ అనిపించేలా ఆడుతున్నాడు." అని పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలకు జడేజా రెండో రోజు ఆట ముగిసిన మాట్లాడుతూ "బ్యాటింగ్ కు దిగి కాస్తో కూస్తో పరుగులు చేసేవాళ్లు ఎవరైనా తమను తాము సరైన బ్యాట్స్ మన్ అనే అనుకుంటారు. నేను క్రీజులోకి వచ్చాక అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాలని భావిస్తాను. క్రీజులో అవతల ఎవరున్నా, వారితో మెరుగైన భాగస్వామ్యం నమోదు చేసేందుకు శ్రమిస్తాను. 2014 తర్వాత ఏంజరిగిందో ఆండర్సన్ ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషం" అని కౌంటర్ వేశాడు. ఇక జడేజా-సీఎస్కే విభేదాలపై విలేకరులు ప్రశ్నలు వేయగా.. జడేజా మాట్లాడుతూ.. 'జరిగిందేదో జరిగిపోయింది. ఐపీఎల్ నా మైండ్ లో లేదు. దేశం తరఫున ఆడుతున్నప్పుడు దృష్టి మొత్తం టీమిండియా మీదే ఉంచాలి. నేనూ అదే చేస్తున్నా. భారత జట్టు తరఫున ఉత్తమంగా ప్రదర్శనలివ్వడం కంటే సంతృప్తి మరొకటి ఉండదు..'అని అన్నాడు.