ఆసీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో గాయపడ్డ టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సిరీస్‌లో మిగితా రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. మిచల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో జడేజా తలకు ఎడమవైపు బంతి తగిలి గాయపడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో బీసీసీఐ మెడికల్ టీమ్ జరిపిన క్లినికల్ డయాగ్నసిస్ ద్వారా జడేజా కాంకషన్‌కు గురైనట్లు తేల్చారు. దీంతో జడేజా మిగితా రెండు మ్యాచ్‌లకు దూరం అవనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
ఇదిలావుంటే.. జడేజా స్థానంలో జట్టులోకి శార్దూల్ ఠాకూర్‌ను తీసుకోనున్నారు. జడేజాను ఇంకా అబ్జర్వేషన్‌లో పెట్టామని, అవసరం అయితే మరిన్ని స్కాన్స్ చేస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇక తొలి టీ20లో విజయంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. కేవలం 23 బంతుల్లో 44 రన్స్ చేసి భారత్ భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. జడేజా దూకుడు బ్యాటింగ్ భారత్ విక్టరీలో కీలకంగా నిలిచింది. ఇక జడేజా స్థానంలో కాంకషన్ ప్లేయర్‌గా ఆడిన చాహల్ కూడా రాణించాడు.