'గిల్ బ్రాడ్‌మన్ లాంటి వాడు..' : టీమిండియా మాజీ కోచ్
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి విజయం సాధించాడు
By Medi Samrat
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో గెలవడం ద్వారా భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి విజయం సాధించాడు. ఈ విజయం తర్వాత గిల్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దానికి కారణం అతని బ్యాటింగ్. ఈ మ్యాచ్‌లో ధీటుగా బ్యాటింగ్ చేసిన గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ బ్యాటింగ్‌ను చూసిన భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అతనిని గ్రేట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్‌తో పోల్చాడు.
గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేశాడు. టెస్టు మ్యాచ్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీంతో గిల్ ఒక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ, సెంచరీ చేసిన భారత్‌కు చెందిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా.. ఓవరాల్‌గా తొమ్మిదో బ్యాట్స్‌మెన్ అయ్యాడు.
గిల్ బ్యాటింగ్, కెప్టెన్సీ చూసి రవిశాస్త్రి చాలా సంతోషంగా ఉన్నాడు. గిల్ కెప్టెన్సీలో భారత్‌కు ఇదే తొలి విజయం. హెడ్డింగ్లీలో భారత్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈసారి కెప్టెన్‌గా గిల్ విజయ ఖాతా తెరిచాడు.
ఆయన స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. "గిల్ ఇన్నింగ్స్ ఓ కెప్టెన్ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్. 10కి 10 మార్కులు. కెప్టెన్ నుండి మీరు అంతకు మించి ఏమీ అడగలేరని నేను భావిస్తున్నాను. సిరీస్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోయారు. అటువంటి పరిస్థితిలో గిల్ వచ్చి బ్రాడ్‌మాన్ లాగా బ్యాటింగ్ చేశాడు. 269, 161 రెండు ఇన్నింగ్సులతో మ్యాచ్ గెలిపించాడని పేర్కొన్నాడు.
గిల్ కెప్టెన్సీపై మాట్లాడుతూ.. పరిస్థితిని బట్టి చర్యలు తీసుకున్నాడని శాస్త్రి చెప్పాడు. మొదట అతను బంతిని ఛేజ్ చేశాడు. కానీ గిల్ రెండో మ్యాచ్‌లో మార్పు చేశాడు. ఆకాశ్‌దీప్‌ని ఆడించడం ద్వారా ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అనుగుణంగా మీకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ బౌలర్‌ను బయటకు తీసుకొచ్చారు. రాబోయే మ్యాచ్‌ల్లో వీరు ఇంగ్లండ్‌ను చాలా ఇబ్బంది పెడతారని పేర్కొన్నాడు.