మైదానంలో 'దూకుడు'తో ప్రసిద్ది చెందిన‌ 'కోహ్లీ' బాడీ లాంగ్వేజ్ మారిందా.? : రవిశాస్త్రి ఏమ‌న్నారంటే..

Ravi Shastri Comments On Virat Kohli. విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

By Medi Samrat  Published on  26 Jan 2022 5:40 AM GMT
మైదానంలో దూకుడుతో ప్రసిద్ది చెందిన‌ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ మారిందా.? : రవిశాస్త్రి ఏమ‌న్నారంటే..

విరాట్ కోహ్లీపై భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత క్రికెట్‌లో శాస్త్రి-కోహ్లీల శకం ముగిసింది. శాస్త్రి కోచ్ పదవి నుంచి వైదొలిగిన తర్వాత విరాట్ కోహ్లీ కూడా మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీని వ‌దులుకున్నాడు. కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత.. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ నేతృత్వంలోని భారత జట్టు వన్డే ద‌క్షిణాఫ్రికా సిరీస్‌ను 0-3 తేడాతో ఓటమి పాలైంది. టెస్టు సిరీస్‌లో 1-2 తేడాతో ఓడిపోయింది. మైదానంలో కోహ్లీ తన దూకుడుతో ప్రసిద్ది చెందాడు. కానీ వన్డే సిరీస్‌లో అతను మునుపటిలా కనిపించలేదు. కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌పై శాస్త్రి సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

కెప్టెన్సీ వివాదం తర్వాత విరాట్ కోహ్లీ బాడీ లాంగ్వేజ్ మారిందా అని రవిశాస్త్రిని అడగగా ? శాస్త్రి బ‌దులిస్తూ.. "నేను ఈ సిరీస్‌లో ఒక బంతిని కూడా చూడలేదు.. అయితే విరాట్ కోహ్లీ పెద్దగా మారతాడని నేను అనుకోను. ఏడేళ్ల తర్వాత క్రికెట్‌కు విరామం ఇచ్చాను. ఒక్కటి మాత్రం నేను పబ్లిక్‌లో విభేదాల గురించి బహిరంగంగా మాట్లాడను. నా పదవీ కాలం ముగిసిన రోజు నుంచి పబ్లిక్ ఫోరమ్‌లో నా ఆటగాళ్ల గురించి మాట్లాడబోనని స్పష్టం చేశాను. కోహ్లీ 68 టెస్టుల్లో 40 గెలిచి టీమిండియా విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని కెప్టెన్సీలో.. భారత జట్టు ఏ ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది. దీని ఆధారంగా కెప్టెన్‌ను అంచనా వేయకూడదని శాస్త్రి అన్నాడు. చాలా మంది పెద్ద ఆటగాళ్లు ప్రపంచకప్ గెలవలేదు. దీంతో ఏం జరిగింది? సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే కూడా గెలవలేదు. వాళ్లను బ్యాడ్ ప్లేయర్స్ అంటారా? అని ప్ర‌శ్నించాడు.


Next Story