రషీద్ ఖాన్ వచ్చేస్తున్నాడు.. నా జీవితంలో చాలా కఠినమైన రోజులు ఇవి..!
ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం
By Medi Samrat Published on 11 March 2024 3:45 PM GMTఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తిరిగి గ్రౌండ్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఐర్లాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తిరిగి పోటీ క్రికెట్‌లోకి రాబోతున్నాడు. లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ గత ఏడాది నవంబర్‌లో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్ తర్వాత కాంపిటీటివ్ క్రికెట్ ఆడలేదు. వెన్ను నొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడంతో రషీద్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ 1-0తో ఆధిక్యంలో ఉండగా, ఐర్లాండ్ ఏకైక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి గేమ్‌లో ఐర్లాండ్ గెలుపొందగా, రెండో మ్యాచ్ వాష్ అవుట్ అయింది. మార్చి 12న సిరీస్‌లోని చివరి ODI తర్వాత, షార్జాలో మార్చి 15, 17, 18 తేదీల్లో మూడు T20Iలలో ఆఫ్ఘనిస్తాన్ ఐర్లాండ్‌తో తలపడనుంది.
ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నానని.. మళ్లీ జాతీయ జెర్సీని ధరించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నాడు రషీద్. నా దేశం కోసం మంచి ప్రదర్శనను ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను అని రషీద్ మార్చి 9న ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో తెలిపాడు. శస్త్రచికిత్స తర్వాత ఊహించిన దానికంటే నెమ్మదిగా కోలుకున్నానని తెలిపాడు. గత మూడు నెలలు తనకు చాలా కష్టమైనవని రషీద్ అంగీకరించాడు. "నాకు శస్త్రచికిత్స జరగడంతో గత మూడు నెలలు కష్టంగా నడిచింది. నేను గత ఏడెనిమిది నెలలుగా వెన్ను గాయంతో బాధపడుతున్నాను. ప్రపంచ కప్‌కు ముందే శస్త్రచికిత్స చేయించుకోమని డాక్టర్ నన్ను అడిగారు, కానీ నేను ప్రపంచ కప్ ఆడాలని నిర్ణయించుకున్నాను. తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నాను. ఇప్పుడు నేను తిరిగి మైదానంలోకి వచ్చాను. ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాను. శస్త్రచికిత్స చేయించుకోవడం, రికవరీ ప్రక్రియ కొనసాగించడం సులభం కాదు. ఎందుకంటే మీరు ప్రతిదానిపై దృష్టి పెట్టాలి. మీ శిక్షణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మొదట నడవడం ఆపై జిమ్ వర్కౌట్‌లు.. ఈ మూడు నెలలు నా జీవితంలో చాలా కఠినమైన రోజులు." అని రషీద్ ఖాన్ వివరించాడు.