తీవ్రమైన గాయంతో ఆ టోర్నీ నుంచి రషీద్ ఖాన్ నిష్క్రమణ
ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా ది హండ్రెడ్ సిరీస్‌కు దూరమయ్యాడు.
By Medi Samrat Published on 13 Aug 2024 2:57 PM ISTఆఫ్ఘనిస్తాన్ స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ తొడ కండరాల గాయం కారణంగా ది హండ్రెడ్ సిరీస్‌కు దూరమయ్యాడు. రషీద్ ఖాన్ గాయం కారణంగా ట్రెంట్ రాకెట్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. శనివారం సదరన్ బ్రేవ్‌తో జరిగిన చివరి ఓవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు 25 ఏళ్ల రషీద్ ఖాన్ గాయపడ్డాడు. రషీద్ ఖాన్ గాయంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు కూడా ఆందోళన చెందుతోంది. వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో ఆఫ్ఘనిస్తాన్ ఏకైక టెస్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. రషీద్ ఖాన్ ఆఫ్ఘనిస్థాన్ కీలక ఆటగాళ్లలో ఒకడు. రషీద్ ఖాన్ మ్యాచ్ సమయానికి ఫిట్‌గా ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ESPNcricinfo నివేదిక ప్రకారం.. రషీద్ ఖాన్‌కు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా స్పిన్ ఆల్ రౌండర్ క్రిస్ గ్రీన్ ట్రెంట్ రాకెట్స్ జట్టులో చేరాడు. పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉన్న ట్రెంట్ రాకెట్స్ ది హండ్రెడ్‌లో నాకౌట్‌కు చేరుకునే అవకాశం ఉంది. రాకెట్స్ ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా,.. మూడింటిలో గెలిచి, మరో మూడు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
ట్రెంట్ రాకెట్స్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. రషీద్ ఖాన్‌తో పాటు పాకిస్థాన్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీమ్ కూడా గాయపడ్డాడు. అయితే ఇమాద్ వసీమ్ మాత్రం టోర్నీకి దూరం కాలేదు. తిరిగి జట్టులోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ట్రెంట్ రాకెట్స్ చివరి మ్యాచ్‌లో కీరన్ పొలార్డ్.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్సు కారణంగా ట్రెంట్ రాకెట్స్ ఒక బంతి మిగిలి ఉండగానే రెండు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. అయితే ది హండ్రెడ్ లో రషీద్ ఖాన్ ప్రదర్శన బాగుంది. రషీద్ ఐదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో రషీద్ 44 పరుగులు కూడా చేశాడు.