ముంబై రంజీ క్రికెట్ మాజీ ఆటగాడు రాజేష్ వర్మ ఆదివారం గుండెపోటుతో మరణించాడు. ముంబై 2006-2007 సీజన్‌లో రంజీ ట్రోఫీని గెలుచుకుంది. ఆ సీజన్‌లో రాజేష్ వర్మ అద్భుత ప్రదర్శన చేశాడు. 40 ఏళ్ల కుడిచేతి వాటం ఆటగాడు రాజేష్ వర్మ మరణాన్ని ముంబై మాజీ సహచరుడు భవీన్ ఠక్కర్ ధృవీకరించారు. రాజేష్ వర్మ ఏడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 2006-07లో రంజీ ట్రోఫీ గెలిచిన ముంబై జట్టులో కీలక ఆటగాడు. అతను 2002-2003లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2008లో మహారాష్ట్రలోని బ్రబౌర్న్ స్టేడియంలో పంజాబ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. రాజేష్ ఏడు మ్యాచ్‌ల్లో 23 వికెట్లు పడగొట్టాడు. 11 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. రాజేష్ వర్మ మృతి పట్ల క్రికెట్ ప్రేమికులు సంతాపం తెలిపారు.