రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ కు వ‌రుస‌గా మూడో ఓట‌మి

Rajasthan Royals won by 57 runs. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 11వ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు భారీ విజయం సాధించింది

By Medi Samrat  Published on  8 April 2023 7:41 PM IST
రాజస్థాన్ రాయల్స్ భారీ విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ కు వ‌రుస‌గా మూడో ఓట‌మి

రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన 11వ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. 200 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టు 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్ బౌల్ట్ 3 వికెట్లు, అశ్విన్ 2, చహల్ 3, సందీప్ శర్మ 1 వికెట్ తీశారు.

రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 199 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు తొలి వికెట్కు ఏకంగా 98 పరుగులు జోడించారు. యశస్వీ జైస్వాల్ కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 60 పరుగులు సాధించారు. జోస్ బట్లర్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్సుతో 79 పరుగులు చేశాడు. చివర్లో హెట్ మెయర్ ( 39: 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దంచేశాడు. రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీయగా..కుల్దీప్ యాదవ్, పావెల్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.


Next Story