ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 172 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో మే 24న జరిగే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తలపడనుంది. అందులో గెలిచిన జట్టు మే 26న కేకేఆర్‌తో ఫైనల్ ఆడాల్సి ఉంది.
IPL 2024 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి ఛాంపియన్‌గా మారాలనే వారి కలను చెరిపేసింది. దీంతో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన బెంగళూరు ప్రయాణం ఐపీఎల్‌లో ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 19 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు జట్టు ఇప్పటి వరకూ జరిగిన 17 ఐపీఎల్ సీజన్లలో ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.
ఇక రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది. దీంతో మే 24న మరో నాకౌట్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మే 26న ఫైనల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడుతుంది. బెంగళూరు ఆటగాళ్లు దినేష్ కార్తీక్‌ను కౌగిలించుకున్న తీరు.. ఐపీఎల్‌లో కార్తీక్‌కు ఇదే చివరి మ్యాచ్ అని భావిస్తున్నారు. అంతకుముందు CSKని ఓడించిన తర్వాత కార్తీక్ మాట్లాడుతూ.. CSKతో జరిగే మ్యాచ్ తన IPL కెరీర్‌లో చివరిదని తాను భావిస్తున్నానని చెప్పాడు. దీంతో కార్తీక్ కెరీర్ ముగిసినట్లే.