టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను ఆపేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మెల్‌బోర్న్‌లో ఇంగండ్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను వర్షం వల్ల నిలిపివేయగా.. ఆ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ విజయాన్ని అందుకుంది. అదే స్టేడియంలో జరగాల్సిన కివీస్, ఆఫ్ఘన్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. వాతావరణంలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో కివీస్, ఆఫ్ఘన్ జట్లకు చెరో పాయింట్ వచ్చింది.
అంతకు ముందు టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ను ఐర్లాండ్ ఓడించింది. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలుగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 పరుగుల తేడాతో ఐర్లాండ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు ఇంగ్లండ్‌కు 158 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం పడటంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. మొయిన్ అలీ 24 పరుగులతో, లియామ్ లివింగ్‌స్టోన్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. దాంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించినట్లు అంపైర్లు ప్రకటించారు.