అనూహ్యంగా మూడో టీ20 'టై'.. సిరీస్ మ‌న‌దే..!

Rain-hit 3rd T20I Ends In Tie, India Wins Series 1-0. నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని మూడవ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By Medi Samrat  Published on  22 Nov 2022 11:51 AM GMT
అనూహ్యంగా మూడో టీ20 టై.. సిరీస్ మ‌న‌దే..!

నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని మూడవ చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో నిర్వ‌హ‌కులు డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిన విజేత‌ను ప్ర‌క‌టించేందుకు ప్ర‌య‌త్పించ‌గా.. అనూహ్యంగా మ్యాచ్ డ్రా కు దారితీసింది. అయినా భారత్ సిరీస్‌ను గెలుచుకోగలిగింది. 161 పరుగుల ఛేదనకు దిగిన‌ భారత్.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. సరిగ్గా అదే స‌మ‌యానికి వ‌ర్షం రావ‌డంతో ఆట నిలిచిపోయింది.

ఆ స‌మ‌యానికి భారత్ డ‌క్‌వ‌ర్త్ లూయిస్‌ స్కోరు 75 ప‌రుగుల‌కు సమానంగా ఉంది. దీంతో 3వ T20I టైగా ముగిసింది. మ్యాచ్ గెలవాలంటే భారత్ 9వ ఓవర్ మార్క్ వద్ద 75 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంది. ఆదివారం మౌంట్ మౌంగనుయ్‌లో జరిగిన 2వ టీ20లో 65 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న‌ భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది.

న్యూజిలాండ్ ఆట‌గాళ్ల‌లో డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధశతకాలు సాధించారు. పవర్‌ప్లే ఓవర్లలో ఫిన్ అలెన్ (3), మార్క్ చాప్‌మన్ (12) త్వ‌ర‌గా నిష్క్రమించినా కాన్వే, ఫిలిప్స్ 86 పరుగుల భాగస్వామ్యంతో బోర్డుపై 160 ప‌రుగుల‌ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరును ఉంచారు. మహ్మద్ సిరాజ్ (4/17), అర్ష్‌దీప్ సింగ్ (4/37) చెరో నాలుగు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు. ఛేదనలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు.


Next Story