పెళ్లి చేసుకున్న క్రికెటర్ రాహుల్ తెవాటియా

Rahul Tewatia ties knots with fiancee Ridhi Panu. క్రికెటర్ రాహుల్ తెవాటియా పెళ్ళికొడుకు అయ్యాడు. రిధి పానుని వివాహం చేసుకున్నాడు

By Medi Samrat  Published on  30 Nov 2021 9:10 AM GMT
పెళ్లి చేసుకున్న క్రికెటర్ రాహుల్ తెవాటియా

క్రికెటర్ రాహుల్ తెవాటియా పెళ్ళికొడుకు అయ్యాడు. రిధి పానుని వివాహం చేసుకున్నాడు. 28 ఏళ్ల తెవాటియా దేశవాళీ క్రికెట్‌లో హర్యానాకు మరియు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ ఆల్ రౌండర్ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకున్నాడు. నితీష్ రాణా, రిషబ్ పంత్ మరియు యుజ్వేంద్ర చాహల్ సహా పలువురు క్రికెటర్లు తెవాటియా వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రాహుల్ తెవాటియా, ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

ఐపీఎల్ 2021లో షార్జాలో రాజస్థాన్ రాయల్స్ తరఫున 224 పరుగుల రికార్డును విజయవంతంగా పూర్తి చేసేందుకు అతను 31 బంతుల్లో 53 పరుగులు చేయడంతో తెవాటియా పాపులర్ అయ్యాడు. తెవాటియా మొదటి 19 బంతుల్లో 8 పరుగులు చేసి తదుపరి 12 బంతుల్లో 45 పరుగులు చేశాడు. భారత్ కు మరో ఆల్ రౌండర్ దొరికాడని అందరూ భావించారు. ఆ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో తెవాటియా 7 సిక్సర్లు కొట్టాడు, షెల్డన్ కాట్రెల్ వేసిన 17వ ఓవర్‌లో 5 సిక్సర్లు కొట్టాడు.

హర్యానా ఆల్‌రౌండర్ ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంత గొప్ప ఆట తీరును ప్రదర్శించలేదు. తన లెగ్ స్పిన్‌తో ఐదు మ్యాచ్‌లలో నాలుగు వికెట్లు సాధించాడు, బ్యాట్‌తో 50 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆంధ్రపై అతని అత్యధిక స్కోరుతో 46 నాటౌట్. డిసెంబరు 8 నుండి ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో ఆల్ రౌండర్ హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తాడు. హర్యానా ఎలైట్ గ్రూప్ సిలో ఉంది. హర్యానా డిసెంబరు 8న ముల్లన్‌పూర్‌లోని కొత్తగా నిర్మించిన మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్‌తో తన మొదటి మ్యాచ్ ఆడనుంది.


Next Story
Share it