రహానేకు చాన్స్.. విహారి ఔట్..!
Rahul hints India will play five bowlers.దక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
By తోట వంశీ కుమార్ Published on 25 Dec 2021 9:34 AMదక్షిణాఫ్రికాతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకి భారత తుది జట్టు ఎంపికపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే ఉన్న సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయాన్ని అందుకోవాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. గత వారం రోజులుగా కోచ్ ద్రావిడ్ ఆధ్వర్యంలో చెమటోడ్చింది. సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానున్న బాక్సింగ్ డే టెస్టులో విజయం సాధించి.. సిరీస్‌లో ఘనంగా బోణి కొట్టాలని ఆటగాళ్లు బావిస్తున్నారు. అయితే టీమ్ఇండియా తుది జట్టు కాంబినేషన్ ఎంపిక చేయడం ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారింది.
ముఖ్యంగా మిడిలార్థర్‌లో ఐదో స్థానం కోసం గట్టి పోటి నెలకొంది. అజింక్యా రహానే, శ్రేయాస్ అయ్యర్, హనుమ విహారి ఈ స్థానం కోసం పోటిపడుతున్నారు. గత కొంతకాలంగా రహానే పేలవ ఫామ్‌తో బాధపడుతుండగా.. అరంగ్రేటం మ్యాచ్‌లోనే సెంచరీ, అర్థశతకంతో శ్రేయాస్ అయ్యర్ కూడా గట్టి పోటి ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ బీసీసీఐ టీవీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాము ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతున్నట్లు హింట్ ఇచ్చాడు.
ఇక మిడిల్ ఆర్డర్ స్థానం కోసం తీవ్ర పోటి నెలకొంది. సీనియర్ ఆటగాడు అజింక్య రహానే తో పాటు హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ ఆ స్థానం కోసం పోటిపడుతున్నారు. విదేశాల్లో అజింక్యాకు మంచి రికార్డు ఉంది. గతంలో మెల్‌బోర్న్, లార్డ్స్ మైదానాల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రస్తుతం అతడికి శ్రేయాస్ నుంచి పోటి ఎదురవుతుంది. ఇటీవల దక్షిణాఫ్రికా-ఏ జట్టుపై హనుమ విహారి కూడా సత్తా చాటి పోటిలోకి వచ్చాడు. ప్రస్తుతం అజింక్య రహానే ఫామ్‌లో లేకపోయినా.. ఇక్కడ ఆడిన అనుభవంతో పాటు విదేశాల్లో మెరుగైన రికార్డులున్న నేపత్యంలో అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఎక్స్ ట్రా బౌలర్‌ను తీసుకుంటే అయ్యర్, రహానేల్లో ఒకరు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుందని అని చెప్పుకొచ్చాడు. రాహుల్ మాటలకు బట్టి చూస్తుంటే.. సీనియర్ ఆటగాడు రహానేకు తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఒకవేళ ఈ టెస్టులో కూడా రహానే విఫలం అయితే.. ఇదే అతడికి చివరి మ్యాచ్ కూడా కావొచ్చు.
ఇప్పటికే గాయం కారణంగా రోహిత్ శర్మ దూరం కాగా.. రహానే, పూజారా, కోహ్లీ లు ఫామ్‌లేమీతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. బ్యాటింగ్‌పై ప్రభావం పడుతుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ నలుగురు బౌలర్లతో బరిలోకి దిగితే.. బౌలర్ల త్వరగా అలసిపోవడమే కాకుండా వారిపై తీవ్ర ఒత్తిడి పడుతుందని బావిస్తున్నారు. అందుకనే ఓ ఆల్‌రౌండర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా.. అయితే టీమ్ కాంబినేషన్‌పై ఆదివారమే క్లారిటీరానుంది.