ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధిస్తాయి : ద్రవిడ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై రాహుల్ ద్రవిడ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి క్రికెటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంబ‌రంలో పాల్గొనడంపై డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్రమైన చర్చలు విన్నానని చెప్పాడు.

By Medi Samrat  Published on  29 July 2024 10:07 AM GMT
ఒలింపిక్స్‌లో భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు బంగారు పతకాలు సాధిస్తాయి : ద్రవిడ్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంపై రాహుల్ ద్రవిడ్ ఆదివారం మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌లో పాల్గొనడానికి క్రికెటర్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని.. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా సంబ‌రంలో పాల్గొనడంపై డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్రమైన చర్చలు విన్నానని చెప్పాడు. 2028లో లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చారు. తాజాగా పారిస్‌లో భారత అథ్లెట్ల సంరక్షణ కోసం ఇండియా హౌస్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించి 'ఒలింపిక్స్‌లో క్రికెట్.. కొత్త శకానికి నాంది' అనే అంశంపై చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రవిడ్ పారిస్‌కు వెళ్లాడు.

ఇండియా హౌస్‌లో జరిగిన చర్చలో భారత మాజీ కెప్టెన్, కోచ్ ద్రవిడ్ మాట్లాడుతూ.. 'డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ విషయంలో నేను తీవ్రమైన చర్చలు విన్నాను. 2026లో జరగనున్న టీ20 ప్రపంచకప్, 2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028 ఒలింపిక్ క్రీడలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. 2028లో ఒలింపిక్స్ లో క్రికెట్ ఉంద‌ని చెప్పడం విన్నాను. క్రికెటర్లు కూడా బంగారు పతకాలు సాధించాలని.. పోడియంపై నిలబడి అతి పెద్ద క్రీడా ఈవెంట్‌లో భాగం కావాలని కోరుకుంటారు. వారు గేమ్స్ విలేజ్‌లో ఉండాలని.. చాలా మంది ఆటగాళ్లతో ఇంటరాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారని తెలిపాడు.

'తదుపరి ఒలింపిక్స్‌కు క్రికెటర్లు దానికి సిద్ధమవుతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారు ఒలింపిక్స్‌లో ఆడ‌టంపై సీరియస్‌గా తీసుకుంటారు. ఆటగాళ్ళు లాస్ ఏంజిల్స్‌ చేరుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తారని అన్నారు. ఈ చర్చలో ద్రవిడ్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీఈవో జియోఫ్ అల్లార్డైస్ కూడా ఉన్నారు. నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఒలింపిక్స్‌లో మహిళల, పురుషుల విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలు సాధిస్తుందని ద్రవిడ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

'మేము ఒలింపిక్స్ చూస్తూ పెరిగాము. కార్ల్ లూయిస్ గోల్డ్ మెడల్ గెలవడం చూశాం. గొప్ప ఆటగాళ్ల ప్రదర్శన చూశా. మీరు ఎల్లప్పుడూ ఇటువంటి గొప్ప కార్యక్రమాలలో భాగం కావాలని కోరుకుంటారు. ఇది నిజంగా ఒక కల.. నిజమైంది. నాకు ఒలింపిక్స్‌లో లాంటి టోర్నీలో క్రికెట్ ఉండాల‌ని.. ఆడాల‌ని కల ఉంది. భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్టు బంగారు పతకాలు సాధిస్తుందని ఆశిస్తున్నాను. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ఇంకా ఎక్కువ ప‌లితాలు కోరుకుంటున్నాను. చాలా మంది భారతీయ అభిమానులు క్రికెట్‌కు మద్దతు ఇవ్వడానికి లాస్ ఏంజిల్స్‌కు రాగలుగుతారు. క్రికెట్ ఎంత పెద్దదో.. గొప్ప ఆటో అని ప్రపంచానికి చూపించగలరు. దురదృష్టవశాత్తూ నేను ఒలింపిక్స్‌లో ఆడలేను.. కానీ కొంత సామర్థ్యంతో అక్కడ ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాను. గత్యంతరం లేక అక్కడ మీడియా వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. టీ20 ప్రపంచకప్ సందర్భంగా అమెరికాలో మార్నింగ్ మ్యాచ్ ఆడాలన్న నిర్ణయాన్ని కూడా ద్రావిడ్ సమర్థిస్తూ.. అందులో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. 'నిజం చెప్పాలంటే ఉదయం 10.30 గంటలకు ఆట‌ ప్రారంభించడం నాకు సమస్యగా భావించడం లేదు. మేము ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఉన్నాం. క్రీడలను చూడాలనుకునే వ్యక్తుల అవసరాలను తీర్చాం. దానితో నాకు ఎలాంటి సమస్య లేదని అన్నాడు.

Next Story