బాబ‌ర్ ఆజామ్‌కు ధైర్యం చెప్పిన ఆఫ్ఘన్ వికెట్ కీపర్..!

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై పాక్ కెప్టెన్‌ బాబర్ అజామ్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు.

By Medi Samrat  Published on  25 Oct 2023 2:00 PM GMT
బాబ‌ర్ ఆజామ్‌కు ధైర్యం చెప్పిన ఆఫ్ఘన్ వికెట్ కీపర్..!

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపై పాక్ కెప్టెన్‌ బాబర్ అజామ్ విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. పాక్ అభిమానులు కూడా అతని కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎంత‌లా అంటే.. ప్రపంచ కప్ ముగిసిన తర్వాత అతడిని పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుండి తొలగించే స్థాయికి పరిస్థితి చేరుకుంది. విమర్శల నేప‌థ్యంలో బాబర్ ఆజామ్‌కు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ ధైర్యం చెప్పాడు.

పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ తర్వాత బాబర్ తన బ్యాట్‌ను గుర్బాజ్‌కి బహుమతిగా ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోను రహ్మానుల్లా గుర్బాజ్ ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. తన మనసులోని భావాలను రాశాడు. 'అద్భుతమైన వ్యక్తి.. అద్భుతమైన ఆటగాడైన బాబ‌ర్ ఆజామ్‌ నుండి అద్భుతమైన బహుమతి. బాబర్ ఆజం నిజంగా జెంటిల్‌మెన్ ప్లేయర్. తల పైకెత్తు.. ధృడంగా ఉండూ.. మెరుస్తూనే ఉండూ అంటూ ఫోస్టు చేశాడు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో రహ్మానుల్లా గుర్బాజ్ ఫోస్టు బాబ‌ర్ ఆజామ్ కు ఊర‌ట క‌లిగించే విష‌యంగా చెప్ప‌వ‌చ్చు.

2023 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 31.40 సగటుతో మొత్తం 157 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. బాబర్ ఆట‌తీరును పరిగణనలోకి తీసుకుంటే.. దీనిని ప్రత్యేక ప్రదర్శన అని పిలవలేమని అభిమానులు నిరాశను వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story