రిటైర్ అవ్వనున్న నాదల్

టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరైన రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన నాదల్ ఇక ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు

By Medi Samrat  Published on  10 Oct 2024 7:37 PM IST
రిటైర్ అవ్వనున్న నాదల్

టెన్నిస్ దిగ్గజాల్లో ఒకరైన రాఫెల్ నాదల్ రిటైర్మెంట్ ప్రకటించారు. 22 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన నాదల్ ఇక ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. డేవిస్ కప్ ఫైనల్ నవంబర్‌ 8న జరగనుంది. ఈ మ్యాచ్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్‌గా నాదల్ చివరి మ్యాచ్ అవుతుంది. నాదల్ గెలిచిన 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్లలో, 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు ఉన్నాయి.

నాదల్ తన కెరీర్ లో మొత్తం 92 ATP సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఇందులో 36 మాస్టర్స్ టైటిల్స్, ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా ఉన్నాయి. మెన్స్ సింగిల్స్‌లో కెరీర్ గోల్డెన్ స్లామ్‌ను పూర్తి చేసిన ముగ్గురు ఆటగాళ్లలో నాదల్ కూడా ఒకరు. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోతో నాదల్ తన రిటైర్మెంట్ వార్తను ప్రకటించారు. "నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నాను. ఇది స్పష్టంగా కష్టమైన నిర్ణయం, ఈ నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. కానీ ఈ జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు ఉంటుంది." అని నాదల్ వివరించారు.

Next Story