2025 ఆసియా కప్ ఫైనల్లో 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, టీం ఇండియా కేవలం 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ముఖ్యమైన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో విఫలమయ్యారు. తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించాడు. అయితే పాకిస్తాన్ పేసర్ హరిస్ రౌఫ్‌కు కూడా సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే భారత జట్టు విజయంలో పాకిస్థాన్ ఆటగాడి సహాయసహకారాలు చాలా కీలకంగా నిలిచాయని రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. భారత జట్టు ఇంత తేలిగ్గా గెలవడానికి సహకరించిన హరీస్ రవూఫ్‌కు థ్యాంక్స్ చెప్పాలని అశ్విన్ అన్నాడు. పాకిస్థాన్‌ను ఓడించి టీమిండియా విజేతగా నిలవడంలో పాక్ పేసర్ హరీస్ రవూఫ్ కీలక పాత్ర పోషించాడని, కీలక సమయంలో ధారాళంగా పరుగులు సమర్పించుకుని భారత్ విజయాన్ని సులభతరం చేసినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పాలన్నాడు అశ్విన్.