సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు

PV Sindhu marches on to the semi-finals of the women's singles round. భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో

By Medi Samrat  Published on  6 Aug 2022 12:48 PM GMT
సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సింధు

భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం పీవీ సింధు కామన్వెల్త్ క్రీడల బ్యాడ్మింటన్ లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ విభాగంలో.. మలేసియాకు చెందిన జిన్ వీయ్ గోతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో సింధు 19-21 21-14 21-18తో విజయం సాధించింది. మూడు గేముల పాటు జరిగిన ఈ సమరంలో సింధు విజయాన్ని అందుకుంది. తొలి గేమును చేజార్చుకున్న సింధు ఆపై వరుసగా రెండు గేముల్లో తన సత్తా చాటింది.

పివి సింధు నెమ్మదిగా మ్యాచ్ ను ప్రారంభించింది. ఓపెనింగ్ గేమ్‌లో 19-21తో ఓడిపోయింది. రెండో గేమ్‌లో పుంజుకుని 21-14తో కైవసం చేసుకుంది. మూడో సెట్ ను 21-18 తేడాతో గెలుచుకుని 2-1తో మ్యాచ్‌ను గెలుచుకుని మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.


Next Story
Share it