'స్విస్ ఓపెన్' విజేతగా పీవీ సింధు
PV Sindhu beats Thailand's Busanan to win women's title. స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్ పోరులో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది భారత షట్లర్ పీవీ సింధు.
By Medi Samrat Published on
27 March 2022 11:57 AM GMT

స్విస్ ఓపెన్ సూపర్-300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఫైనల్ పోరులో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది భారత షట్లర్ పీవీ సింధు. ఆదివారం థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను ఓడించిన సింధూ.. ఈ సీజన్‌లో తన రెండో మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. సెయింట్ జాకోబ్‌షాల్‌లో జరిగిన టోర్నమెంట్ ఫైనల్‌లో సింధు 49 నిమిషాల్లో 21-16, 21-8తో నాలుగో సీడ్ బుసానన్ పై గెలుపొందింది.
ఇప్పటివరకూ బుసానన్ చేతిలో ఒక్కసారి మాత్రమే ఓడిపోయిన సింధు.. 17 మ్యాచ్‌లలో 16 విజయాలు సాధించింది. గత సంవత్సరం ఇదే టోర్ని పైనల్‌లో రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో సింధూ ఓడిపోయింది. హైదరాబాద్‌కు చెందిన 26 ఏళ్ల సింధూ.. 2019లో ఇదే వేదికపై జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం సాధించింది. ఇక ఈ ఏడాది జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300లో కూడా సింధు విజేతగా నిలిచింది.
Next Story